జనసేనానికి మద్దతుగా ప్రచారం చేస్తా: నవదీప్
- లవ్ మౌళి మూవీ ట్రైలర్ విడుదల సందర్భంగా పిఠాపురంలోని శ్రీపాదవల్లభుడిని దర్శించుకున్న నవదీప్
- పవన్ కల్యాణ్‌కు మద్దతు తెలుపుతూ ఎన్నికల ప్రచారం చేస్తానని వెల్లడి
- నిజాయతీగా ఎవరు పోటి చేసినా ప్రజలు ఆదరిస్తారన్న టాలీవుడ్ హీరో
ఈ నేపథ్యంలో జనసేనానికి తన మద్దతు తెలుపుతూ ఎన్నికల ప్రచారం చేస్తానని నవదీప్ తెలిపారు. ఆయన పిఠాపురంలోని శ్రీపాద వల్లభ మహాసంస్థానాన్ని బుధవారం సందర్శించారు. తాను నటించిన 'లవ్ మౌళి' సినిమా ట్రైలర్ విడుదల సందర్భంగా శ్రీపాదవల్లభుడి ఆలయంలో నవదీప్ ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా నవదీప్ మీడియాతో మాట్లాడుతూ.. నిజాయతీగా ఎవరు పోటీ చేసినా ప్రజలు ఆదరిస్తారని చెప్పారు. పవన్‌కు తన మద్దతు ఉంటుందని తెలిపారు. లవ్ మౌళి సినిమా ట్రైలర్ విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, హైదరాబాద్, కాకినాడ థియేటర్లలో ప్రదర్శించడం జరుగుతుందని, ప్రేక్షకుల రెస్పాన్స్ తెలుసుకునేందుకు పర్యటిస్తున్నట్లు చెప్పారు. సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందన్నారు. ఓ భిన్నమైన ప్రేమకథతో వస్తున్న ఈ మూవీలో నవదీప్ సరసన గిద్వానీ, భావన్ హీరోయిన్లుగా నటించారు.