రూ.25 కోట్ల విలువైన కార్లతో దుబాయ్ లో అనంత్ అంబానీ, రాధిక కాన్వాయ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రూ.25 కోట్ల విలువైన కార్లతో దుబాయ్ లో అనంత్ అంబానీ, రాధిక కాన్వాయ్

Ananth Ambani and Radhika costly convoy in Dubai
  • ఇటీవలే అట్టహాసంగా జరిగిన అనంత్, రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుక
  • తాజాగా దుబాయ్ లో షాపింగ్ చేసిన కాబోయే దంపతులు
  • జులైలో జరగబోతున్న అంబానీ కుటుంబ పెళ్లి వేడుక
పెళ్లి అంటేనే సామాన్యుడు సైతం వీలైనంత అట్టహాసంగా జరుపుకునే ఒక వేడుక. అదే పెళ్లి వేడుక శ్రీమంతుల ఇంట్లో జరిగితే... అది ఓ రేంజ్ లో ఉంటుంది. భారత శ్రీమంతుడు ముఖేశ్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్ లో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. రాధికా మర్చంట్ తో అనంత్ పెళ్లి త్వరలోనే జరగబోతోంది. తాజాగా అనంత్, రాధిక జంట దుబాయ్ లో షాపింగ్ చేస్తూ కనిపించారు. భారీ సెక్యూరిటీ మధ్య వారు దుబాయ్ లోని మాల్ లో షాపింగ్ చేశారు. 

వారు షాపింగ్ చేసిన వస్తువులను తెచ్చుకోవడానికి ఏకంగా రూ. 25 కోట్ల విలువైన కార్ల కాన్వాయ్ ని వినియోగించారు. ఆ కాన్వాయ్ లో రోల్స్ రాయిస్ కలినాన్ బ్లాక్ బ్యాడ్జ్ తో పాటు ఎన్నో లగ్జరీ కార్లు ఉన్నాయి. ఒక అంబులెన్స్ కూడా కాన్వాయ్ లో ఉండటం గమనార్హం. గత ఏడాది వీరి నిశ్చితార్థం జరిగింది. ఈ ఏడాది జులైలో వీరి వివాహం జరగబోతోంది. వీరి వివాహానికి దేశంలోని పలువురు రాజకీయ ప్రముఖులతో పాటు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎంతో మంది సెలబ్రిటీలు హాజరు కానున్నారు. 
Advertisement
Ananth Ambani
Radhika
Dubai
Shopping
Convoy

More Telugu News