చందాలు వేసుకొని మరీ విరాళం ఇచ్చిన మహిళలు.. బెంగాల్ లో కాంగ్రెస్ నేత ప్రచారంలో ఘటన
- 11 మంది మహిళలు కలిసి 11 వేలు అందించారు
- బెర్హాంపూర్ నియోజకవర్గంలో అధిర్ రంజన్ పై ఓటర్ల అభిమానం
- కూలీనాలి చేసి సంపాదించిన సొమ్ము అందజేసిన వైనం
కాంగ్రెస్ అభ్యర్థి అధిర్ రంజన్ చౌదరికి ఈ నియోజకవర్గం పెట్టని కోట.. 1999 నుంచి ఆయన ఇక్కడ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. తాజాగా పార్టీ మళ్లీ ఆయనకే టికెట్ ఇచ్చింది. దీంతో ప్రచారం మొదలు పెట్టిన అధిర్ రంజన్.. ఆదివారం బెర్హాంపూర్ లో ఓటర్లను కలిశారు. ఈ క్రమంలోనే ఆదివారం రాణ గ్రామ్ విలేజ్ లో అధిర్ రంజన్ ప్రచారం నిర్వహించారు. వీధివీధి తిరుగుతూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ఓట్లడిగారు. ఓ వీధిలో అధిర్ రంజన్ ను సాదరంగా స్వాగతించిన మహిళలు.. రూ. 11 వేలు విరాళం అందించారు. మళ్లీ ఆయనే గెలవాలని ప్రార్థనలు చేస్తున్నట్లు చెప్పారు.