జూన్‌లో విడుదలకు సిద్ధమవుతోన్న కమల్ హాసన్ ‘భారతీయుడు 2’
- కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో భారతీయుడు 2
- శరవేగంగా రూపుదిద్దుకుంటున్న చిత్రం
- తాజాగా ఆసక్తికర పోస్టర్ పంచుకున్న చిత్రబృందం
కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో 1996లో విడుదలై బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన ‘ఇండియన్’ చిత్రాన్ని తెలుగులో ‘భారతీయుడు’గా విడుదల చేయడం తెలిసిందే. ఆ మూవీకి సీక్వెల్‌గా ఇప్పుడు ‘ భారతీయుడు 2’ రూపొందుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
ఈ సినిమాను జూన్ నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో రిలీజ్ పోస్టర్ ను చిత్రబృందం విడుదల చేసింది. పోస్టర్‌ను గమనిస్తే... కమల్ హాసన్ తెల్లటి ధోతి, కుర్తాలో కనిపిస్తున్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం అంటే ఎంత స్వచ్ఛంగా ఉండాలో అంతటి స్వచ్ఛత పోస్టర్ లో స్పష్టంగా కనిపిస్తోంది. జీరో టాలరెన్స్ (తప్పును అస్సలు భరించలేను) అని పోస్టర్‌పై ఉన్న లైన్ చాలా ప్రభావవంతంగా ఉంది.
ఇక కమల్ హాసన్ కూడా సీరియస్, ఇన్‌టెన్స్ లుక్‌లో కనిపిస్తున్నారు. అలాగే మనదేశాన్ని అవినీతి పట్టి పీడిస్తోందనే విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా ఈ పోస్టర్‌తో వివరించే ప్రయత్నం చేశారు.
ఈ చిత్రంలో సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, ఎస్.జె.సూర్య, బాబీ సింహ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రవివర్మన్ సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు.