ఏం పాపం చేశానని నాకు టికెట్ ఇవ్వలేదు? .. 26 రోజులుగా నాకు నిద్ర లేదు: టీడీపీ నేత బండారు సత్యనారాయణ
- వైసీపీ నుంచి తనకు ఆఫర్లు వచ్చాయన్న బండారు
- తన కట్టె కాలేంత వరకు టీడీపీలోనే ఉంటానని వ్యాఖ్య
- జగన్ ప్రభుత్వం 11 కేసులు పెట్టినా భయపడలేదన్న బండారు
తనకు టికెట్ రాకపోవడం బాధ కలిగించిందని బండారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించినప్పటి నుంచి పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని... తాను ఏం పాపం చేశానని టికెట్ ఇవ్వలేదని ప్రశ్నించారు. పార్టీలు మారిన నేతలకు టికెట్ కేటాయించారని అన్నారు. తాను పోటీ చేయకుండా కొందరు నేతలు అడ్డుకున్నారని మండిపడ్డారు. గత 26 రోజులుగా తనకు నిద్ర లేదని తెలిపారు. తనపై జగన్ ప్రభుత్వం 11 కేసులు పెట్టినా భయపడలేదని... ప్రభుత్వంపై పోరాటం చేశానని చెప్పారు. తనకు పదవులు ముఖ్యం కాదని అన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.