గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యాకు దారుణ అవమానం.. వీడియో ఇదిగో!
- గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ జరుగుతుండగా మైదానంలోకి దూసుకొచ్చిన శునకం
- దానిని చూస్తూ ‘హార్దిక్.. హార్దిక్’ అని ప్రేక్షకుల అరుపులు
- గుజరాత్ ఫ్యాన్స్‌పై మండిపడుతున్న నెటిజన్లు
వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. హార్దిక్ చేసిన నేరమేంటని ప్రశ్నిస్తున్నారు. అహ్మదాబాద్ అభిమానులకు ఏమైందని నిలదీస్తున్నారు. పాండ్యాను శునకంతో ఎందుకు పోల్చుతున్నారని మండిపడుతున్నారు. వారి ప్రవర్తన ఏమాత్రం బాగోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాండ్యా ముంబైకి వెళ్లిపోవడంతో జీర్ణించుకోలేక గుజరాత్ ఫ్యాన్స్ ఇలాంటి నీచానికి దిగజారారని విమర్శిస్తున్నారు. అసలు పాండ్యాను వ్యతిరేకించడానికి గల ఒక్క కారణమైనా చెప్పగలరా? అని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు.