జొమాటో కస్టమర్లకు షాక్.. క్యాష్‌తో చెల్లిస్తే అదనపు ఛార్జీ.. ఎంతంటే?
- సీఓడీ ఎంచుకునే జొమాటో కస్టమర్లకు రూ.5-20 అదనపు ఛార్జీ
- సాధారణంగా రూ.5గా ఫీజు కనిపిస్తున్నట్లు నివేదికలు
- కొందరికి రూ.7, మరికొందరికి రూ.20 వరకు ఛార్జీ
- ఆన్‌లైన్ చెల్లింపులకు ఈ అదనపు భారం వర్తించదని వెల్లడి
- ప్లాట్‌ఫామ్, ప్యాకేజింగ్ ఛార్జీలకు ఇది అదనం
ఆన్‌లైన్‌లో కాకుండా ఆర్డర్ డెలివరీ సమయంలో నగదు చెల్లించే జొమాటో కస్టమర్లకు ఇక అదనపు భారం పడనుంది. క్యాష్ ఆన్ డెలివరీ (సీఓడీ) ఎంచుకునే వారిపై రూ.5 నుంచి రూ.20 వరకు ప్రత్యేక ఛార్జీని జొమాటో వసూలు చేయడం ప్రారంభించింది.
బిల్లులో ప్రత్యేకంగా ఛార్జీ
జొమాటో యాప్‌లోని బిల్ సమ్మరీలో ‘పే ఆన్ డెలివరీ ఫీ’ పేరుతో ఈ ఛార్జీ కనిపిస్తోంది. సాధారణంగా రూ.5గా ఉన్నప్పటికీ, కొందరు వినియోగదారులకు రూ.7గా, మరికొందరికి ఏకంగా రూ.20గా ఛార్జీ పడినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. ఆన్‌లైన్‌లో చెల్లించే కస్టమర్లకు ఈ రుసుము ఉండదు.
ఇతర ఛార్జీలకు అదనం
ప్లాట్‌ఫామ్ ఫీజు, రెస్టారెంట్ ప్యాకేజింగ్ ఛార్జీలు, జీఎస్‌టీకి సీఓడీ ఫీజు అదనం. ఆహార డెలివరీ రంగంలో పోటీ పెరుగుతున్న వేళ చెల్లింపు విధానాల నుంచి కూడా ఆదాయం పెంచుకునే ప్రయత్నంలో జొమాటో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
జొమాటో రోజుకు సుమారు 23 లక్షల నుంచి 25 లక్షల ఫుడ్ ఆర్డర్లను ప్రాసెస్ చేస్తోంది. రాపిడోకు చెందిన ఓన్లీ, ఫ్లిప్‌కార్ట్ ఈట్ ఇన్ సేవలతో పోటీ మరింత పెరుగుతోంది. జొమాటో ప్రధాన ప్రత్యర్థి స్విగ్గీ మాత్రం ఇప్పటివరకు ఇలాంటి సీఓడీ ఛార్జీని ప్రవేశపెట్టలేదు.
చిన్న పెంపుతో భారీ ఆదాయం
2023లో ఫుడ్ డెలివరీ సంస్థలు ప్లాట్‌ఫామ్ ఫీజులను ప్రవేశపెట్టాయి. స్విగ్గీ తొలుత రూ.2 వసూలు చేయగా, తర్వాత జొమాటో కూడా ఇదే విధానాన్ని అమలు చేసింది. ఈ ఏడాది జొమాటో ప్లాట్‌ఫామ్ ఫీజును రూ.12.50 నుంచి రూ.14.99కి పెంచింది. దీనికి జీఎస్‌టీ అదనం.