పాకిస్థాన్ సూపర్ లీగ్ విజేత ఇస్లామాబాద్ యునైటెడ్
- పీఎస్ఎల్ ఫైనల్‌లో ముల్తాన్ సుల్తాన్స్ ఓటమి
- మూడో సారి టైటిల్ గెలిచిన ఇస్లామాబాద్
- అర్ధ శతకం (50) తో రాణించిన మార్టిన్ గప్టిల్
- 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా ఇమాద్ వసీం
- షదాబ్ ఖాన్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డ్
ఆ తర్వాత 160 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇస్లామాబాద్ యునైటెడ్‌ను న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు మార్టిన్ గప్టిల్ అర్ధ శతకం (50) తో విజయం దిశగా నడిపించాడు. చివరలో ఆ జట్టు బౌలర్ నసీం షా (17) మెరుపు బ్యాటింగ్‌తో ఇస్లామాబాద్ విజయం సాధించింది. ఎనిమిది వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఐదు వికెట్లతో ఇస్లామాబాద్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఇమాద్ వసీం 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. అలాగే 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డ్ షదాబ్ ఖాన్‌కు దక్కింది.