లండన్‌ 'ది షార్డ్' వద్ద సీఎం విజయ్ ఈవెంట్ రద్దు... తీవ్ర నిరాశలో అభిమానులు

లండన్‌ 'ది షార్డ్' వద్ద సీఎం విజయ్ ఈవెంట్ రద్దు... తీవ్ర నిరాశలో అభిమానులు

CM Vijay event at London The Shard cancelled fans deeply disappointed
  • లండన్ లో ఉన్న విజయ్ ని చూసేందుకు వేచిచూసిన వందలాది మంది అభిమానులు
  • భద్రతా కారణాలతో కార్యక్రమాన్ని రద్దు చేసిన లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు
  • ఈరోజు భారత్ కు తిరిగి రానున్న విజయ్

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ని చూసేందుకు లండన్‌లోని అత్యంత ఎత్తైన భవనం 'ది షార్డ్' వద్ద నిన్న వందలాది మంది అభిమానులు భారీగా గుమిగూడారు. అయితే, అత్యధిక జనసందోహం కారణంగా భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు హెచ్చరించడంతో ఆ కార్యక్రమాన్ని నిర్వాహకులు రద్దు చేశారు. గంటల తరబడి వరుసల్లో వేచి ఉన్న అభిమానులకు ఈ నిర్ణయం తీవ్ర నిరాశను మిగిల్చింది.


"శాంతిభద్రతలు, ప్రజా భద్రత దృష్ట్యా ముందస్తు అనుమతి లభించకపోవడంతో ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నాం" అని ముఖ్యమంత్రి బృందానికి చెందిన ప్రతినిధి మైక్‌లో ప్రకటించారు. "తమిళనాడులో చూసే జనసందోహంతో పోలిస్తే ఇది చాలా తక్కువే అయినప్పటికీ, భద్రత పరంగా పోలీసుల నిర్ణయం సహేతుకమైనదే. కానీ గంటల తరబడి హోటల్ బయట వేచి ఉన్న అభిమానులకు నిరాశ తప్పలేదు" అని ఒక యువ అభిమాని పేర్కొన్నారు.


మరోవైపు, తమిళనాడును ఆసియాలోనే అధునాతన తయారీ, సాంకేతిక కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా విజయ్ నేతృత్వంలోని బృందం బ్రిటన్ పర్యటన చేపట్టింది. ఈ పర్యటనలో భాగంగా రూ. 12,300 కోట్ల విలువైన ఒప్పందాలపై సంతకాలు జరిగినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో దాదాపు 9,400 కంటే ఎక్కువ ఉన్నత స్థాయి ఉద్యోగాలు లభించనున్నాయనే అంచనాలు ఉన్నాయి. తన యూకే పర్యటనను ముగించుకుని విజయ్ ఈరోజు భారత్‌కు చేరుకోనున్నారు.

Advertisement
Joseph Vijay
Tamil Nadu CM London visit
The Shard London event
London Metropolitan Police
Tamil Nadu UK investment deals
CM Vijay fan meet cancelled

More Telugu News