లేజర్ ఫోకస్... రియల్ స్లిమ్ ఫొటో పంచుకున్న మహేశ్ బాబు
- తన లుక్ మార్చుకోవడంపై ఫోకస్ పెట్టిన మహేశ్ బాబు
- జర్మనీ వైద్య నిపుణుడి సలహాలు పాటిస్తున్న వైనం
- త్వరలో రాజమౌళితో మహేశ్ బాబు సినిమా
గత కొన్ని సినిమాల్లో మహేశ్ బాబు ఎంతో స్లిమ్ గా కనిపిస్తున్నారు. తాజాగా, సోషల్ మీడియాలో ఆయన పంచుకున్న ఫొటో చూస్తే ఇంకా స్లిమ్ గా మారి సరికొత్త మహేశ్ బాబు అనేలా దర్శనమిస్తున్నారు. అంతేకాదు, 'లేజర్ ఫోకస్' (తదేక దీక్ష) అంటూ తన ఫొటోకు క్యాప్షన్ ఇచ్చారు.
మహేశ్ బాబు ఇటీవలే 'గుంటూరు కారం' చిత్రంతో ప్రేక్షకుల ముందుకువచ్చారు. దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం మహేశ్ తో చేయబోయే చిత్రం స్క్రిప్టుపై పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రం పట్టాలెక్కనుంది. అడ్వెంచర్ జానర్ లో పాన్ వరల్డ్ స్థాయిలో ఈ చిత్రం రూపొందించనున్నారు.