Advertisement

వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం.. జాతికి అంకితం చేసిన సీఎం జగన్

CM YS Jagan speech at veligond project opening
  • నాడు తండ్రి వైఎస్ఆర్ ప్రాజెక్టుకు శంకుస్థాప‌న‌ 
  • నేడు కొడుకు జ‌గ‌న్ సీఏం హోదాలో ప్రాజెక్ట్ ప్రారంభోత్స‌వం 
  • ద‌శాబ్దాల క‌ల సాకార‌మైంద‌ని సీఏం జ‌గ‌న్ హ‌ర్షం
కొద్దిసేప‌టి క్రితం వెలిగొండ ప్రాజెక్ట్‌ను ముఖ్యమంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఘ‌నంగా ప్రారంభించారు. అనంత‌రం ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ మాట్లాడుతూ.. దశాబ్దాల క‌ల సాకార‌మైనందుకు గ‌ర్వంగా ఉంద‌న్నారు. అద్భుత‌మైన ప్రాజెక్ట్ పూర్తి కావ‌డం ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేశారు. త‌న తండ్రి వైఎస్ఆర్ శంకుస్థాప‌న చేసిన ప్రాజెక్టును తాను పూర్తి చేయ‌డం ఎంతో ఆనందాన్ని ఇచ్చింద‌ని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఏకంగా 15.25 ల‌క్ష‌ల మంది తాగునీటి స‌మ‌స్య తీరడ‌మ‌నేది హ‌ర్షించ‌ద‌గిన‌దిగా చెప్పుకొచ్చారు. అంతేగాక వెలిగొండ ప్రాజెక్ట్ ద్వారా ప్ర‌కాశం, నెల్లూరు, వైఎస్ఆర్ జిల్లాల ప‌రిధిలోని మెట్ట ప్రాంతాల‌కు 4.47ల‌క్ష‌ల ఎక‌రాల‌కు సాగునీరు అందుతుంద‌ని సీఏం తెలిపారు.
Advertisement
YS Jagan
Veligond project
Andhra Pradesh

More Telugu News