BC Declaration: బీసీ డిక్లరేషన్ విడుదల చేసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్

Chandrababu and Pawan Kalyan released BC Declaration
షార్ట్స్‌లో చూడండి
మంగళగిరిలో జయహో బీసీ సభకు హాజరైన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ బీసీ డిక్లరేషన్ ను విడుదల చేశారు. ఈ బీసీ డిక్లరేషన్ లో పలు కీలక అంశాలు ఉన్నాయి. 

బీసీ డిక్లరేషన్ పాయింట్లు...

* బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్లు
* పెన్షన్ నెలకు రూ.4 వేలకు పెంపు
* బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం
* సామాజిక న్యాయ పరిశీలన కమిటీ ఏర్పాటు
* బీసీ సబ్ ప్లాన్ తో ఐదేళ్లలో రూ.1.5 లక్షల కోట్ల కేటాయింపు... సబ్ ప్లాన్ నిధులు బీసీలకే వినియోగించేలా చర్యలు
* స్థానిక సంస్థల్లో 34 శాతం బీసీ రిజర్వేషన్ పునరుద్ధరణ
* చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కోసం తీర్మానం
* అన్ని సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో 34 శాతం రిజర్వేషన్... కొన్ని బీసీ వర్గాలకు కోఆప్షన్ సభ్యులుగా అవకాశం
* జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్ల ఏర్పాటు... జనాభా దామాషా ప్రకారం నిధుల కేటాయింపు
* బీసీల స్వయం ఉపాధికి రూ.10 వేల కోట్లు... రూ.5 వేల కోట్లతో 'ఆదరణ' పరికరాలు.
* బీసీలకు పారిశ్రామిక ప్రోత్సాహకాల పునరుద్ధరణ
* చట్టబద్ధంగా కులగణన
* రూ.10 లక్షలతో చంద్రన్న బీమా పునరుద్ధరణ
* చంద్రన్న పెళ్లికానుక రూ.1 లక్షకు పెంపు
* శాశ్వత కుల ధృవీకరణ పత్రాల అందజేత  
* విద్యాపథకాలు అన్నీ పునరుద్ధరణ
* బీసీ గురుకులాలను జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేస్తాం
* షరతులు లేకుండా  విదేశీ విద్య
* పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ పునరుద్ధరణ
* ఏడాది లోపు బీసీ భవనాలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలు పూర్తి
Go Back to Shorts
BC Declaration
Chandrababu
Pawan Kalyan
Jayaho BC
Mangalagiri

More Telugu News