గ్రామస్థుడు తీసుకొచ్చిన ఆహారాన్ని ఆరగించిన అపరకుబేరుడు ముకేశ్ అంబానీ.. వీడియో ఇదిగో
- అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ-వెడ్డింగ్ వేడుకలకు ముందు ‘అన్న సేవ’లో ఆసక్తికర ఘటన
- గ్రామస్థుడు తీసుకొచ్చిన ఆహారాన్ని తిని అభినందించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత
- సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
గ్రామస్థుడి భోజనం తిన్న అంబానీ
అంబానీ ఇంట జరిగిన ‘అన్న సేవ’లో చుట్టుపక్కల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వారిలో కొంతమంది కాబోయే దంపతులు అనంత్-రాధిక చల్లగా ఉండాలని ఆశీర్వదించారు. కొందరైతే బహుమతులు కూడా అందించారు. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఓ గ్రామస్థుడు ముఖేష్ అంబానీ కోసం తన ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని తీసుకొచ్చాడు. ఈ విషయాన్ని ముకేశ్ అంబానీకి తెలియజేయగా ఆయన స్వీకరించారు. ఆహార పాత్రను తన చేతుల్లోకి తీసుకొని సంతోషంగా తింటూ కనిపించారు. ఆహారాన్ని సిద్ధం చేసి తీసుకొచ్చిన వ్యక్తికి అభినందనలు తెలియజేశారు. ఈ దృశ్యానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా చిన్ననాటి స్నేహితులైన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల నిశ్చితార్థం గతేడాది జనవరి 19న ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.