'గీతాంజలి మళ్లీ వచ్చింది' నుంచి సునీల్ పోస్టర్!

Geethanjali Malli Vachindi Movie Update
  • అంజలి 50వ సినిమాగా 'గీతాంజలి మళ్లీవచ్చింది' 
  • హారర్ కామెడీ జోనర్లో నడిచే కథాకథనాలు 
  • కీలకమైన పాత్రలో కనిపించనున్న సునీల్ 
  • ఏప్రిల్ 11వ తేదీన విడుదల కానున్న సినిమా  

స్టార్ కమెడియన్ గాను .. హీరోగాను తన ప్రత్యేకతను చాటుకున్న సునీల్, ప్రస్తుతం కీలకమైన పాత్రలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. వైవిధ్యభరితమైన పాత్రలతో మెప్పిస్తూ వెళుతున్నాడు. ఆయన నుంచి ప్రేక్షకులను పలకరించనున్న సినిమాలలో 'గీతాంజలి మళ్లీ వచ్చింది' ఒకటి. అంజలి టైటిల్ రోల్ ను పోషించిన ఈ సినిమాలో, సునీల్ ఓ కీలకమైన పాత్రలో నటించాడు.

ఈ రోజున సునీల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమా టీమ్ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన స్పెషల్ పోస్టర్ ను వదిలింది. పాడుబడిన బంగ్లా మెట్లపై కూర్చుని, భయంగా .. ఆశ్చర్యంగా దేనినో చూస్తున్నట్టుగా ఆయన ఈ పోస్టర్లో కనిపిస్తున్నాడు. ఈ  హారర్ కామెడీ మూవీలో ఆయన పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందనే విషయం ఈ పోస్టర్ చూస్తేనే అర్థమైపోతోంది.

ఇక అంజలికి కెరియర్ పరంగా ఇది 50వ సినిమా. అందువలన ఈ సినిమా తన కెరియర్లో ప్రత్యేకమైనదిగా ఆమె భావిస్తోంది. కోన వెంకట్ ఈ సినిమాకి కథ - స్క్రీన్ ప్లే అందించడమే కాకుండా, నిర్మాణ భాగస్వామిగా కూడా వ్యవహరిస్తున్నాడు. శివ తుర్లపాటి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా, ఏప్రిల్ 11వ తేదీన విడుదల కానుంది.
Go Back to Shorts
Anjali
Sunil
Kona Venkat
Geethanjali Malli Vachindi

More Telugu News