నాకు మరోసారి అన్యాయం జరిగింది: బూరగడ్డ వేదవ్యాస్

Buragadda Vedavyas unhappy
  • పెడన టికెట్ ను కాగిత కృష్ణప్రసాద్ కు ప్రకటించిన చంద్రబాబు
  • తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన వేదవ్యాస్
  • ఇండిపెండెంట్ గా పోటీ చేసినా గెలిచే సత్తా ఉందని ధీమా
94 మంది అభ్యర్థులతో టీడీపీ అధినేత చంద్రబాబు తొలి జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో పలువురు నేతలకు టికెట్ దక్కలేదు. పెడన టికెట్ ను కాగిత కృష్ణప్రసాద్ కు ప్రకటించారు. అయితే ఈ స్థానం నుంచి తనకు టికెట్ దక్కకపోవడంపై బూరగడ్డ వేదవ్యాస్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. చంద్రబాబు మాట ప్రకారం 2019 ఎన్నికల్లో పోటీ నుంచి తాను తప్పుకున్నానని... ఈసారైనా న్యాయం దక్కుతుందని అనుకుంటే... మరోసారి అన్యాయం జరిగిందని అన్నారు. చంద్రబాబు, పవన్ లను కలిసి తనకు జరిగిన అన్యాయంపై ప్రశ్నిస్తానని చెప్పారు. టీడీపీ, జనసేన కార్యకర్తల మద్దతు తనకే ఉందని... ఇండిపెండెంట్ గా పోటీ చేసినా గెలిచే సత్తా తనకు ఉందని ధీమా వ్యక్తం చేశారు. వేదవ్యాస్ ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
Go Back to Shorts
Buragadda Vedavyas
Telugudesam
Chandrababu
Pawan Kalyan
Janasena

More Telugu News