24 సీట్లేనా అనుకోవద్దు.. జనసైనికులకు పవన్ కీలక సూచన
- 98 శాతం స్ట్రైక్ రేట్ కోసమే ఈ సీట్లు తీసుకున్నట్లు వెల్లడి
- పోటీ చేసిన ప్రతీ చోటా జనసేనను గెలిపించుకోవాలని పిలుపు
- 3 పార్లమెంట్ సీట్లను కలుపుకుంటే 40 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లేనని వివరణ
- అప్పట్లో ఓ పది సీట్లన్నా గెలుచుకుని ఉంటే ఇప్పుడు ఎక్కువ అడిగే వాళ్లమన్న జనసేనాని
2019లో జనసేన కనీసం పది సీట్లైనా గెలుచుకుని ఉంటే ఇప్పుడు ఎక్కువ సీట్లను అడిగి తీసుకునే అవకాశం ఉండేదని పవన్ కల్యాణ్ చెప్పారు. జనసేన పోటీ చేసే 24 సీట్లను కేవలం ఓ నెంబర్ గానే చూడొద్దని అన్నారు. 98 శాతం స్ట్రైక్ రేట్ ఉండాలనే ఉద్దేశంతోనే టీడీపీ ఆఫర్ చేసిన 24 సీట్లతో సర్దుకుపోతున్నామని వివరించారు. కాగా, 24 అసెంబ్లీ స్థానాలకు గానూ శనివారం ఐదుగురు అభ్యర్థుల పేర్లను పవన్ కల్యాణ్ ఖరారు చేశారు. జనసేనానితో పాటు నాగబాబు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయంపై సస్పెన్స్ కొనసాగుతోంది.