లాస్య నందిత భౌతిక కాయానికి నివాళి అర్పించిన కేసీఆర్

KCR pays tributes to Lasya Nandita
  • రోడ్డు ప్రమాదంలో దుర్మరణంపాలైన నందిత
  • కార్ఖానాలోని నందిత నివాసానికి వెళ్లిన కేసీఆర్
  • నందిత కుటుంబ సభ్యులకు పరామర్శ
రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆమె భౌతికకాయానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాళి అర్పించారు. హైదరాబాద్ కార్ఖానాలోని నందిత నివాసానికి వెళ్లిన కేసీఆర్... ఆమె భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. అనంతరం నందిత తల్లి, మాజీ ఎమ్మెల్యే సాయన్న భార్య, ఇతర కుటుంబ సభ్యులను కేసీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా కేసీఆర్ వెంట హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఉన్నారు.

 అంతకు ముందు ట్విట్టర్ వేదికగా కేసీఆర్ స్పందిస్తూ... రోడ్డు ప్రమాదంలో నందిత మరణించడం ఎంతో బాధాకరమని చెప్పారు. పిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలుపొందిన లాస్య ప్రజల మన్ననలు పొందారని అన్నారు. కష్టకాలంలో వారికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. 
Advertisement
KCR
BRS
Lasya Nandita

More Telugu News