తెలుగులోనూ ఓ సినిమాలో నటించిన పూనమ్ పాండే

Poonam Pandey acts only one Telugu movie
షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ మోడల్, నటి పూనమ్ పాండే గర్భాశయ క్యాన్సర్ తో మరణించారు. ఇన్ స్టాగ్రామ్ లో ఆమె ఫొటోలు, వీడియోలు రసికులను అలరించేలా వేరే లెవెల్లో ఉంటాయి. సినిమాల కంటే ఫొటో షూట్లతోనే ఆమె చాలా బిజీగా ఉంటారు. ఏమైనా గానీ, క్యాన్సర్ తో పూనమ్ పాండే మృతి చెందారన్న వార్త అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. 32 ఏళ్ల వయసుకే ఆమె కన్నుమూయడం అభిమానులను తీవ్ర విషాదానికి గురిచేస్తోంది. 

కాగా, పూనమ్ పాండే గతంలో ఓ తెలుగు సినిమాలోనూ నటించారు. ఆ సినిమా పేరు 'మాలిని అండ్ కో'. ఈ సినిమాలో 'బిగ్ బాస్' ఫేమ్ సామ్రాట్ హీరో. ఈ చిత్రం 2015లో వచ్చింది. ఆ తర్వాత పూనమ్ పాండే మళ్లీ తెలుగులో నటించలేదు. ఆమె 2013లో 'నషా' అనే బాలీవుడ్ చిత్రంతో సినీ కెరీర్ ప్రారంభించారు. బాలీవుడ్ లోనూ ఆమె నటించిన చిత్రాలు తక్కువే.
Go Back to Shorts
Poonam Pandey
Demise
Survical Cancer
Telugu Movie
Malini and Co
Tollywood
Bollywood

More Telugu News