Ambati Rambabu: తెలుసుకో తమ్ముడు పవన్ కల్యాణ్: అంబటి రాంబాబు

Ambati Rambabu tweet on Pawan Kalyan
షార్ట్స్‌లో చూడండి
త్వరలో ఏపీలో జరగనున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే సీట్ల పంపకాలపై ఇరు పార్టీల మధ్య ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఈ రెండు పార్టీల పొత్తుపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదంటూ విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ మంత్రి అంబటి రాంబాబు జనసేనాని పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి మరోసారి ఎక్స్ వేదికగా కామెంట్ చేశారు. పొత్తు ధర్మమే కాదు, ఏ ధర్మమూ పాటించని వాడే బాబు అని విమర్శించారు. ఈ విషయాన్ని తెలుసుకో తమ్ముడు పవన్ కల్యాణ్ అంటూ ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Ambati Rambabu
YSRCP
Pawan Kalyan
Janasena
Chandrababu
Telugudesam

More Telugu News