ష్యూరిటీపై బయటకు వచ్చిన చంద్రబాబు భవిష్యత్తుకు గ్యారెంటీ ఎలా ఇస్తారు?: వైసీపీ ఎంపీ మార్గాని భరత్
- లోకేశ్ భవిష్యత్తుకు గ్యారెంటీ కోసమే చంద్రబాబు కుట్రలు అన్న భరత్
- 2014 మేనిఫెస్టోను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్న
- కాంగ్రెస్ లో చేరడంపై షర్మిల ఆలోచించుకోవాలని సూచన
యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చే స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ ని చూసి యావత్ దేశం ఆశ్చర్యపోయిందని భరత్ అన్నారు. ఏపీకి కాంగ్రెస్ ఎంతో అన్యాయం చేసిందని... ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిధుల్లో అన్యాయం చేసిందని... అలాంటి పార్టీలో చేరడంపై వైఎస్ షర్మిల మరోసారి ఆలోచించుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ... రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు.