పహారీ భాషలోకి అనువదించి రామ్ భజనను ఆలపించిన కశ్మీరీ ముస్లిం అమ్మాయి
- రామ్ భజనను ఆలపించిన బటూల్ జెహ్రా అనే 19 ఏళ్ల యువతి
- జుబిన్ హిందీలో పాడిన రామ్ భజన తనకు ప్రేరణ అన్న యువతి
- లెఫ్టినెంట్ గవర్నర్ హిందూ అయినా అభివృద్ధిలో మతాన్ని చూడరని ప్రశంస
సోమవారం ఆమె మాట్లాడుతూ... గాయకుడు జుబిన్ నౌటియాల్ హిందీలో పాడిన రామ్ భజన తనను పాడేందుకు ప్రేరేపించిందని తెలిపారు. యూట్యూబ్‌లో హిందీలో జుబిన్ పాడిన రామ భజనను చూశానని... తొలుత హిందీలో పాడానని, బాగా నచ్చిందని.. దీంతో పహారీ భాషలో పాడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. దానిని హిందీ నుంచి పహారీలోకి అనువదించి రామ్ భజన పాడానన్నారు. తాను ముస్లి అయినప్పటికీ రామ్ భజన పాడటం తప్పేమీ కాదన్నారు.
తమ లెఫ్టినెంట్ గవర్నర్ ఓ హిందూ అని.. కానీ ఆయన అభివృద్ధి విషయంలో మతాన్ని చూడరని తెలిపారు. హిందువులు, సిక్కులు, జైనులు, క్రైస్తవులు అందరూ సోదరులేనని తాను నమ్ముతానని పేర్కొన్నారు.