చంద్రబాబు, పవన్ ఫొటో పై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు

AP Minister Ambati Rambabu Contraversial Tweet On Chandrababu And Pawan Kalyan
ఏపీ మినిస్టర్ అంబటి రాంబాబు తాజాగా చేసిన ట్వీట్ తీవ్ర వివాదాస్పదంగా మారింది. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఫొటోను ట్వీట్ చేస్తూ మంత్రి అంబటి చేసిన కామెంట్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. సంక్రాంతి సందర్భంగా ఆదివారం మందడంలో నిర్వహించిన వేడుకల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. అనంతరం ఇరువురు నేతలు గంగిరెద్దు పక్కన నిలబడి ఫొటో దిగారు.

ఈ ఫొటోను టీడీపీ, జనసేన నేతలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మంత్రి అంబటి రాంబాబు ఈ ఫొటోను షేర్ చేస్తూ.. ‘బాబు పక్కన రెండు గంగిరెద్దులు’ అంటూ కామెంట్ చేశాడు. ఈ ట్వీట్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్లు, టీడీపీ, జనసేన అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. పలువురు రాజకీయ నేతలు కూడా మంత్రి తీరును తప్పుబడుతున్నారు.
Go Back to Shorts
Ambati Rambabu
Chandrababu Pawan
Gangireddu
Contraversy
Andhra Pradesh
Janasena
Twitter

More Telugu News