డేటింగ్ రూమర్స్‌..ఆ మిస్టరీ మ్యాన్ ఎవరో చెప్పేసిన నటి కంగనా

Kangana Ranaut reacts to dating rumours after walking hand in hand with mystery man
  • మిస్టరీ మ్యాన్‌తో కంగనా రనౌత్ ఫొటోలు వైరల్
  • కంగనా ప్రేమలో పడిందంటూ బాలీవుడ్‌లో వార్తలు వైరల్
  • డేటింగ్ వార్తలను ఖండించిన కంగనా
  • ఫొటోలోని వ్యక్తి తన హెయిర్ స్టైయిలిస్ట్ అని వివరణ
ఫైర్‌బ్రాండ్‌ నటి కంగనా రనౌత్ ప్రేమలో పడిందన్న వార్త ప్రస్తుతం బాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తితో కంగనా చేతిలో చేయి వేసి హుషారుగా నడుస్తున్న ఫొటో జనాల కంట పడటంతో ఒక్కసారిగా ఈ రూమర్స్ గుప్పుమన్నాయి. ఫొటోలోని మిసర్టీ వ్యక్తి ఎవరా? అంటూ జనాలు తెగ చెవులు కొరికేసుకున్నారు. ఈ వార్తలపై కంగనా ఎప్పటిలాగే తనదైన స్టైల్లో స్పందించింది. ఆడా మగా కలిసి కనిపిస్తే చాలు వాళ్లు డేటింగ్‌లో ఉన్నట్టు భావిస్తే ఎలా అని ప్రశ్నించింది. తన వెంట ఉన్న మిస్టరీ మ్యాన్ ఎవరో కూడా చెప్పేసింది. 

సెలూన్ బయట తరచూ నాతో పాటూ కనిపించే మిస్టరీ మ్యాన్ ఎవరని అడుగుతూ నాకు చాలా మంది ఫోన్లు చేశారు. మెసేజీలు కూడా పెట్టారు. మా బంధం గురించి బాలీవుడ్ వార్తా సంస్థలు తెగ ఊహించుకుంటూ వార్తలు రాసుకొచ్చాయి. ఆడా, మగా వీధిలో కలిసి నడుస్తూ వెళుతుంటే వారి మధ్య ప్రేమే కాదు అనేక ఇతర విషయాలు కూడా ఉండొచ్చు. వారు తోబుట్టువులు, సహోద్యోగులు లేదా వర్క్ ఫ్రెండ్స్ కూడా కావొచ్చు. కొన్ని సందర్భాల్లో ఒకరు హెయిర్ స్టైలిస్ట్ అయితే మరొకరు వారి ఫ్రెండ్లీ కస్టమర్ కూడా కావచ్చు’’ అని కంగనా సెటైర్ పేల్చింది. ఫొటోలోని మిస్టరీ మ్యాన్ తన హెయిర్ స్టైయిలిస్ట్ అన్న విషయాన్ని తనదైన శైలిలో వివరించింది. దీంతో, కంగనా డేటింగ్ రూమర్స్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడినట్టైంది.
Advertisement
Kangana Ranaut
Bollywood

More Telugu News