'నా సామిరంగ'... టైటిల్ సాంగ్ విడుదలైంది!

Title song from Naa Saamiranga movie out now
  • నాగార్జున హీరోగా నా సామిరంగ చిత్రం
  • నాగ్ సరసన కథానాయికగా ఆషికా రంగనాథ్
  • ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్న కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ
  • జనవరి 14న విడుదల
మా జోలికొస్తే... మాకడ్డువస్తే... మామూలుగా ఉండదు... నా సామిరంగ...
ఈ గీత తొక్కితే... మా సేత సిక్కితే... మామూలుగా ఉండదు... నా సామిరంగ... 

...అంటూ కింగ్ నాగార్జున తన మిత్రబృందంతో కలిసి దుమ్మురేపే టైటిల్ సాంగ్ 'నా సామిరంగ' చిత్రం నుంచి తాజాగా విడుదలైంది. ఈ పాటలో నాగ్ తో పాటు అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ కూడా కనిపిస్తారు. 

ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి బాణీలకు, ఆస్కార్ విన్నింగ్ లిరిక్ రైటర్ చంద్రబోస్ సాహిత్యం అందించారు. "నా సామిరంగ" అంటూ ఎంతో హుషారుగా సాగే ఈ టైటిల్ సాంగ్ ను కీరవాణి తనయుడు కాలభైరవ, 'చిచ్చా' రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. 

శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నా సామిరంగ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. నా సామిరంగ చిత్రంలో నాగార్జున సరసన ఆషికా రంగనాథ్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం 2024 జనవరి 14న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
Go Back to Shorts
Naa Saamiranga
Title Song
Nagarjuna
Allari Naresh
Raj Tarun
Vijay Binny
MM Keeravani
Chandrabose
Srinivasa Chitturi

More Telugu News