లోకేశ్ కు అభినందనలు.. పవన్ కు థ్యాంక్స్: చంద్రబాబు

Chandrababu congratulates Nara Lokesh
  • యువగళం విజయవంతం కావడంపై లోకేశ్ కు చంద్రబాబు అభినందనలు
  • తమ పోరాటానికి పవన్ మద్దతుగా నిలిచారని ప్రశంస
  • టీడీపీ, జనసేన కలయికపై ప్రజలు నమ్మకంగా ఉన్నారని వ్యాఖ్య
యువగళం పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేసిన యువనేత నారా లోకేశ్ ను టీడీపీ అధినేత నారా లోకేశ్ ప్రశంసించారు. 'యువగళంను దిగ్విజయంగా పూర్తి చేసిన లోకేశ్ కు అభినందనలు. టీడీపీ పోరాటానికి మద్దతుగా నిలిచిన పవన్ కల్యాణ్ కు ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారనే సంకేతాలను నిన్న జరిగిన యువగళం నవశకం చాటి చెప్పింది. టీడీపీ, జనసేన కలయికపై ప్రజలు నమ్మకంగా ఉన్నారు. రెండు పార్టీలు కలిసికట్టుగా ఏపీని దేశంలోనే గొప్ప రాష్ట్రంగా పునర్నిర్మిస్తాయి' అని ట్వీట్ చేశారు. యువగళం విజయోత్సవ సభకు సంబంధించిన కొన్ని ఫొటోలను ఆయన షేర్ చేశారు. 

Advertisement
Chandrababu
Nara Lokesh
Telugudesam
Pawan Kalyan
Janasena

More Telugu News