Chandrababu: పోలిపల్లిలో సభా ప్రాంగణం వద్దకు చేరుకున్న చంద్రబాబు, బాలకృష్ణ

Chandrababu and Balakrishna arrives Polipalli
షార్ట్స్‌లో చూడండి
విజయనగరం జిల్లా పోలిపల్లి వద్ద టీడీపీ ఏర్పాటు చేసిన యువగళం నవశకం భారీ బహిరంగ సభ ప్రాంగణం వద్దకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కొద్దిసేపటి కిందట చేరుకున్నారు. చంద్రబాబు రాకతో సభా ప్రాంగణం నినాదాలతో హోరెత్తిపోయింది. చంద్రబాబుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, పార్టీ అగ్రనేత గంటా శ్రీనివాసరావు తదితరులు స్వాగతం పలికారు. అప్పటికే నారా లోకేశ్ వేదికపై ఉండగా... చంద్రబాబు, బాలకృష్ణల రాకతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉప్పొంగింది. పసుపు జెండాలు రెపరెపలాడాయి. సభా ప్రాంగణం అంతా పసుపుమయం అయింది.
Go Back to Shorts
Chandrababu
Balakrishna
Polipalli
Yuvagalam Navasakam
Nara Lokesh
TDP
Andhra Pradesh

More Telugu News