ముఖ్యమంత్రిగా ఆమెకు తొలి ఉద్యోగం... రేపు సీఎం హోదాలో రేవంత్ రెడ్డి సంతకం
- కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దివ్యాంగురాలికి ఉద్యోగం ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ
- ఈ మేరకు యువతికి గ్యారెంటీ కార్డుపై సంతకం చేసిచ్చిన రేవంత్ రెడ్డి
- రేపు ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానం
రజని నాంపల్లికి చెందిన యువతి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే రోజున సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే వస్తారని.. వారి సమక్షంలోనే ఉద్యోగం ఇస్తామని ఆమెకు రేవంత్ హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆమెకు రేవంత్ రెడ్డి గ్యారెంటీ కార్డును రాసి ఇచ్చారు. రేపు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రజనికి ఉద్యోగం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ప్రమాణ స్వీకారానికి రజనికు కూడా అహ్వానం పంపించారు.