మైసూర్ స్టేడియంలో తనయుడి ఆట... భార్యతో కలిసి వీక్షించిన ద్రావిడ్

మైసూర్ స్టేడియంలో తనయుడి ఆట... భార్యతో కలిసి వీక్షించిన ద్రావిడ్

Rahul Dravind enjoys his son play at Mysore stadium
  • కూచ్ బెహార్ ట్రోఫీలో కర్ణాటక వర్సెస్ ఉత్తరాఖండ్
  • కర్ణాటక జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ద్రావిడ్ తనయుడు సమిత్
  • తనయుడి ఆటను ఆస్వాదించిన ద్రావిడ్ దంపతులు  
భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్ తనయుడు సమిత్ కూడా తండ్రి బాటలోనే జూనియర్ క్రికెట్ నుంచే పరుగుల మోత మోగిస్తున్నాడు. సమిత్ ప్రస్తుతం జాతీయ స్థాయి కూచ్ బెహార్ టోర్నమెంట్ లో కర్ణాటక రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మైసూరులో నిన్న కర్ణాటక, ఉత్తరాఖండ్ జట్ల మధ్య కూచ్ బెహార్ టోర్నీలో భాగంగా మ్యాచ్ జరిగింది. ఈ నేపథ్యంలో తనయుడి ఆట చూసేందుకు ద్రావిడ్, తన భార్య విజితా పెందార్కర్ తో కలిసి మైసూరు స్టేడియంకు వెళ్లాడు. ఎంతో నిరాడంబరంగా స్టేడియానికి వచ్చిన ద్రావిడ్ దంపతులు సమిత్ ఆటను ఆస్వాదించారు. కాగా, ద్రావిడ్ చిన్న కుమారుడు అన్వయ్ కూడా క్రికెటరే. ప్రస్తుతం అన్వయ్ కర్ణాటక రాష్ట్ర అండర్-14 కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.
Advertisement
Rahul Dravid
Samith
Mysore
Karnataka

More Telugu News