ముంబై ఎయిర్ పోర్టులో వెరిఫికేషన్ సందర్భంగా చిరునవ్వులు చిందించిన షారుఖ్ ఖాన్
Add ap7am to your home Screen

ముంబై ఎయిర్ పోర్టులో వెరిఫికేషన్ సందర్భంగా చిరునవ్వులు చిందించిన షారుఖ్ ఖాన్

Shah Rukh patiently waits for police verification at Mumbai airport
  • నిన్న ముంబై ఎయిర్ పోర్టులో కనిపించిన షారుఖ్ 
  • ఎంట్రెన్స్ గేట్ వద్ద షారుఖ్ పోలీస్ వెరిఫికేషన్
  • ఎంతో ఓపికగా కనిపించిన షారుఖ్ 
బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ ఈ వయసులో కూడా తగ్గేదే లే అంటున్నారు. వరుసగా రెండు బ్లాక్ బస్టర్ హిట్లను సాధించి తన సత్తా ఏంటో మరోసారి చూపించారు. తాజాగా ఈ ఏడాదిలో షారుఖ్ చివరి చిత్రం 'డంకీ' ఈ నెలలో విడుదల కాబోతోంది. మరోవైపు, నిన్న షారుఖ్, ఆయన టీమ్ ముంబై ఎయిర్ పోర్టులో కనిపించారు. విమానాశ్రయం ఎంట్రెన్స్ గేట్ వద్ద పోలీసులు షారుఖ్ ఖాన్ పాస్ పోర్టును వెరిఫై చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ సందర్బంగా షారుఖ్ ఎంతో ఓపికగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. పోలీసు అధికారులను చూస్తూ చిరునవ్వులు చిందించారు. అనంతరం ఎయిర్ పోర్ట్ లోకి వెళ్లిపోయారు.    
Advertisement
Shahrukh Khan
Bollywood
Mumbai Airport
Police Verification

More Telugu News