Advertisement

2024లో తిరుపతి లడ్డూ నాణ్యతలో తేడాను మీరు చూస్తారు: నారా లోకేశ్

Nara Lokesh on Tirumala laddu quality
  • లడ్డూ నాణ్యతపై మనం ఫిర్యాదులు వింటూనే ఉన్నామన్న లోకేశ్
  • 2024లో లడ్డూ అసలైన నాణ్యతను పునరుద్ధరిస్తామని వ్యాఖ్య
  • మార్చి / ఏప్రిల్ లో టీటీడీని స్వాధీనం చేసుకుంటామన్న లోకేశ్
హిందూ భక్తులు ఎంతో పవిత్రంగా చూసే తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి లడ్డూలో నాణ్యత తగ్గిపోయిందంటూ విమర్శలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తిరుమల లడ్డూల గురించి తాజాగా టీడీపీ యువనేత నారా లోకేశ్ స్పందించారు. ఎంతో పవిత్రమైన లడ్డూ నాణ్యత పడిపోవడంపై అనేక ఫిర్యాదులు మనం వింటూనే ఉన్నామని ఆయన చెప్పారు. దైవ ప్రసాదం అసలు నాణ్యతను 2024 మార్చి / ఏప్రిల్ లో తాము స్వాధీనం చేసుకున్న తర్వాత పునరుద్ధరిస్తామని తెలిపారు. లడ్డూ నాణ్యతలో తేడాను మీరు గమనిస్తారని అన్నారు.
Advertisement
Tirumala Laddu
Nara Lokesh
Telugudesam
Tirupati
Andhra Pradesh

More Telugu News