Ram Charan: ఓటు వేసేందుకు మైసూరు నుంచి హైదరాబాద్ బయల్దేరిన రామ్ చరణ్

 Ram Charan fly to Hyderabad from Mysore to cast his vote tomorrow
షార్ట్స్‌లో చూడండి
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రేపటి ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రేపు (నవంబరు 30) జరగనుండగా, ఓ పౌరుడిగా తన బాధ్యత నెరవేర్చడం పట్ల రామ్ చరణ్ కూడా ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. ఓటు వేయడం కోసం ఆయన మైసూరు నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బయల్దేరారు. 

రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'గేమ్ చేంజర్' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా కథ కూడా ప్రజాస్వామ్యం, ఎన్నికల చుట్టూనే తిరుగుతుంది. 'గేమ్ చేంజర్' తాజా షెడ్యూల్ చిత్రీకరణ మైసూరులో జరుగుతోంది. 

దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ కథానాయిక. ఈ పాన్ ఇండియా చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.
Go Back to Shorts
Ram Charan
Vote
Hyderabad
Mysore
Assembly Elections
Telangana

More Telugu News