ప్రెగ్నెంట్ అయినప్పటి అనుభూతిపై ఇలియానా భావోద్వేగం
- పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా
- ఇలియానా భర్త ఎవరనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ
- తన బిడ్డకు తండ్రి ఎవరనే విషయాన్ని ఇటీవలే వెల్లడించిన ఇల్లీ
ఈ క్రమంలో తాను గర్భవతినంటూ ఇలియానా ప్రకటించడంతో అందరూ షాక్ కు గురయ్యారు. ఇలియానా భర్త ఎవరనే చర్చ పెద్ద ఎత్తున సాగింది. అయితే ఇవేమీ పట్టించుకోని ఇలియానా... పండంటి కొడుక్కి జన్మనిచ్చారు. ఆ తర్వాత తన బిడ్డకు తండ్రి ఎవరనే విషయాన్ని ఆమె వెల్లడించారు.
తాజాగా ఇలియానా తాను ప్రెగ్నెంట్ అయిన తర్వాత తన మొదటి అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఎంతో భావోద్వేగంతో ఆమె పోస్ట్ పెట్టారు. కరెక్ట్ గా ఏడాది క్రితం ఇదే రోజున తన చిన్నారి తన లోపల చిన్న పరిణామంలో పెరగడం ప్రారంభించాడని ఆమె చెప్పారు. ఆ సమయంలో తన భావాలు, భావోద్వేగాలు, నాడులు చిన్నారిని బాగా చూసుకోవాలనే విషయాన్ని గుర్తించడం తనకు ఇంకా గుర్తుందని తెలిపారు. ఏడాది తర్వాత తన చేతుల్లో తన కొడుకు నిద్రపోతుండటం చాలా అద్భుతంగా ఉందని చెప్పారు. ఇలియానా పోస్ట్ పై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.