షాంపూతో జుట్టు రాలిందంటూ తనని దూషించిన మహిళపై యువకుడి దాడి

kakinada Woman attacked by medical shop worker over hairloss with shampoo
  • కాకినాడలో ఘటన
  • మెడికల్ షాపులో కొనుగోలు చేసిన షాంపూతో వృద్ధురాలి జుట్టు రాలిన వైనం
  • షాపులోని యువకుడిపై వృద్దురాలి ఆగ్రహం
  • రోజూ తనను దూషిస్తోందన్న ఆగ్రహంతో వృద్ధురాలిపై యువకుడి హత్యాయత్నం
తనను రోజూ దూషిస్తోందన్న కోపంతో ఓ వృద్ధురాలిపై మెడికల్ షాపు సిబ్బంది ఒకరు దాడి చేసిన ఘటన కాకినాడలో వెలుగు చూసింది. కాకినాడ రెండో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధీనగర్ వెంకట నారాయణ వీధికి చెందిన చెల్లంచెర్ల సత్యవతి ఇటీవల ఓ జనరిక్ మెడికల్ షాపులో షాంపూ కొన్నారు. ఆ తరువాత ఆమెకు జుట్టు రాలడంతో దుకాణంలో పనిచేస్తున్న యువకుడు వెంకటేశ్‌ను దూషించడం ప్రారంభించారు. రోజూ ఆమె తనను దుర్భాషలాడటాన్ని భరించలేకపోయిన అతడు ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. 

ఆదివారం వెంకటేశ్ ఓ దుకాణంలో కత్తి కొనుగోలు చేశాక, వృద్ధురాలు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో వెళ్లి ఆమెపై దాడి చేశాడు. కత్తితో పలుమార్లు పొడిచాడు. ఈ క్రమంలో కత్తి విరిగిపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలికి ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు. నిందితుడిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు.
Go Back to Shorts
Andhra Pradesh
Crime News

More Telugu News