పవన్ కల్యాణ్ కంటే బర్రెలక్క కర్నె శిరీష బెటర్: రామ్ గోపాల్ వర్మ
- తాండూరులో పవన్ కల్యాణ్ వీడియోను ఎక్స్ వేదికగా షేర్ చేసిన రామ్ గోపాల్ వర్మ
- ఇంత దారుణమైన, అనాసక్తి, అజాగ్రత్త ప్రచారాన్ని ఇంతకుముందెప్పుడూ చూడలేదని విమర్శలు
- సభ నిర్వాహకులు కూడా మైక్ సౌండ్ గురించి పట్టించుకోలేదన్న వర్మ
ఇంతకంటే దారుణమైన, ఏమాత్రం ఆసక్తిలేని, అజాగ్రత్త ప్రచారాన్ని తాను ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదని, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్... తాను మాట్లాడుతున్నప్పుడు కనీసం మైక్ సౌండ్ గురించి కూడా పట్టించుకోలేదని.. కనీసం సభ నిర్వాహకులు కూడా దానిని పట్టించుకోలేదని పేర్కొన్నారు. జనసేనానితో పోలిస్తే ప్రచారంలో బర్రెలక్క కర్నె శిరీష మెరుగ్గా ఉందని వ్యాఖ్యానించారు.