Advertisement

'నా అన్వేషణ' యూట్యూబ్ చానల్ ను తప్పకుండా ప్రశంసించాలి: నారా లోకేశ్

Nara Lokesh opines on Naa Anveshana Youtube channel
  • యూట్యూబ్ లో ఎంతో పాప్యులారిటీ పొందిన 'నా అన్వేషణ' చానల్
  • ఇటీవల ఏపీ రాజకీయ పరిస్థితులపై ఓ వీడియో పోస్టు చేసిన నా అన్వేషణ
  • సదరు చానల్ కు లోకేశ్ రూ.5 కోట్లు ఇచ్చాడంటూ ఓ పత్రికలో కథనం
  • వైసీపీ ఎప్పుడో దిగజారిపోయిందన్న లోకేశ్
యూట్యూబ్ వీడియోలు చూసేవారికి 'నా అన్వేషణ' చానల్ గురించి తెలిసే ఉంటుంది. ఓ యువకుడు ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ, తనకు తోచినట్టుగా మాట్లాడుతూ, కొన్నిసార్లు ఘాటైన పదాలు ఉపయోగిస్తూ వీడియోలు పోస్టు చేస్తుంటాడు. 'నా అన్వేషణ' యూట్యూబ్ చానల్ కు 18 లక్షల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. 

అయితే, ఈ యూట్యూబ్ చానల్లో ఇటీవల రాజకీయపరమైన అంశాలతో కూడిన వీడియో ఒకటి దర్శనమిచ్చింది. అందులో జింబాబ్వే దేశంలోని అధిక ద్రవ్యోల్బణం పరిస్థితులను, ఏపీ పరిస్థితులను పోల్చడం కనిపిస్తుంది. అయితే, 'నా అన్వేషణ' చానల్ కు నారా లోకేశ్ రూ.5 కోట్లు ఇచ్చాడంటూ ఓ పత్రికలో వార్త వచ్చింది. నారా లోకేశ్ డబ్బిచ్చి అతడితో ఆ విధంగా చెప్పించాడన్నది ఆ పత్రికా కథనం సారాంశం. 

దీనిపై నారా లోకేశ్ స్పందించారు. "వైసీపీ ఎప్పుడో దిగజారిపోయింది. ఇంతకంటే ఇక దిగజారడానికి ఏమీ లేదు. జగన్ విధ్వంసక పాలనను ప్రశ్నించినవారిని అప్రదిష్ఠ పాల్జేసేలా వైసీపీ 5 రూపాయల పేటీఎం బ్యాచ్ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మన రాష్ట్ర శ్రేయస్సు, రాష్ట్ర భవిష్యత్తుపై బాధ్యతాయుతంగా స్పందించి, అభిప్రాయాలను వెల్లడించిన 'నా అన్వేషణ'ను తప్పకుండా ప్రశంసించాలి" అని పేర్కొన్నారు.
Advertisement
Nara Lokesh
Naa Anveshana
Youtube Channel
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News