అతను అమ్మాయిలను టార్గెట్ చేయడానికి అదే కారణం: 'పర్ ఫ్యూమ్' ట్రైలర్ రిలీజ్!
- సైకో థ్రిల్లర్ కంటెంట్ తో 'పర్ ఫ్యూమ్'
- దర్శకత్వం వహించిన దుర్గస్వామి
- సంగీతాన్ని అందించిన అజయ్ అరసాడ
- ఈ నెల 24వ తేదీన సినిమా విడుదల
ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇది స్మెల్ బేస్డ్ థ్రిల్లర్ స్టోరీ అనే విషయం ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. స్మెల్ కారణంగా ఒక సైకో అమ్మాయిలను వెంటాడటం .. వేటాడటం .. ప్రేమ పేరుతో వేధించడం ఈ ట్రైలర్ లో కనిపిస్తుంది. అతణ్ణి పట్టుకోవడానికి పోలీస్ టీమ్ సతమతమవుతూ ఉంటుంది.
చేనాగ్ .. ప్రాచీ థాకర్ .. అభినయ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను, సుధాకర్ - రాజీవ్ కుమార్ నిర్మించారు. దుర్గాస్వామి దర్శకత్వం వహించాడు. అజయ్ అరసాడ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను ఈ నెల 24వ తేదీన విడుదల చేస్తున్నారు.