కేసీఆర్ పూర్వీకుల గ్రామ ప్రజలు ఇచ్చిన డబ్బుతో కామారెడ్డిలో రేవంత్ రెడ్డి నామినేషన్
- ప్రత్యేక హెలికాప్టర్‌లో సిద్ధరామయ్యతో కలిసి కామారెడ్డికి చేరుకున్న రేవంత్ రెడ్డి
- భారీ ర్యాలీతో వెళ్లి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాల సమర్పణ
- కార్యక్రమంలో నారాయణ, చాడ, కోదండరాం, షబ్బీర్ అలీ తదితరులు
విరాళాలు సేకరించిన కేసీఆర్ పూర్వీకుల గ్రామస్తులు
కేసీఆర్ పూర్వీకుల గ్రామమైన కొనాపూర్‌కు చెందిన ప్రజలు కొంత డబ్బులను విరాళాల రూపంలో సేకరించి రేవంత్ రెడ్డికి అందించారు. ఈ డబ్బును రేవంత్ రెడ్డి నామినేషన్ పత్రాలు సమర్పించేందుకు వినియోగించారు. రేవంత్ రెడ్డి ఈ నెల 6న తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో నామినేషన్ దాఖలు చేశారు. కాగా, గతంలో కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి షబ్బీర్ అలీ ప్రాతినిధ్యం వహించారు. ఇప్పటి వరకు కామారెడ్డి నుంచి పోటీచేసిన షబ్బీర్ అలీ ఈసారి నిజామాబాద్ అర్బన్ నుంచి బరిలో నిలిచారు.