మాకూ టిక్కెట్లు ఇవ్వండి!: కాంగ్రెస్ పార్టీపై రేణుకా చౌదరి ఆగ్రహం
- కమ్మ నాయకులు అంటే పార్టీకి అంత లోకువా? అని రేణుకా చౌదరి నిలదీత
- పిల్లికి భిక్షం వేసినట్లు నాలుగు బిస్కెట్లు వేస్తే ఎలా? అని ప్రశ్న
- ఇతర పార్టీలు చేసినట్లు కాంగ్రెస్ ఎందుకు చేయడం లేదని నిలదీత
పార్టీ టిక్కెట్ల కేటాయింపులలో సామాజిక న్యాయం జరగలేదన్నారు. బయటి నుంచి వచ్చిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారన్నారు. డబ్బున్నవారి కంటే దమ్మున్నోళ్లకు టిక్కెట్లు ఇవ్వాలన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిణామాలపై కమ్మ వర్గం ఆగ్రహంగా ఉందన్నారు. వారి మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.