తాత ఎక్కడ అని దేవాన్ష్ అడుగుతున్నాడు: నారా భువనేశ్వరి
- విదేశాలకు వెళ్లాడని అబద్ధం చెప్పాల్సి వచ్చిందని వెల్లడి
- నిజం గెలవాలి యాత్ర సభలో మాట్లాడిన నారా భువనేశ్వరి
- ఇంట్లో నలుగురం నాలుగు దిక్కులు అయ్యామని విచారం
చంద్రబాబు జైల్లో ఉన్నట్లు తెలియక, ఇంట్లో ఆయన కనిపించకపోవడంతో తాత ఎక్కడ అని దేవాన్ష్ అడుగుతున్నాడని నారా భువనేశ్వరి చెప్పారు. అయితే, చిన్న వయసు కావడంతో చంద్రబాబు అరెస్ట్ విషయం చెప్పలేదని వివరించారు. తాత విదేశాలకు వెళ్లారని చెబుతూ వస్తున్నామని నారా భువనేశ్వరి తెలిపారు.