మరో రికార్డును క్రియేట్ చేసిన బాలయ్య 'భగవంత్ కేసరి'
Add ap7am to your home Screen

మరో రికార్డును క్రియేట్ చేసిన బాలయ్య 'భగవంత్ కేసరి'

Bala Krishna Bhagawanth Kesari creates another record in Book My Show
  • ఇప్పటికే రూ. 100 కోట్ల క్లబ్ లో చేరిన 'భగవంత్ కేసరి'
  • బుక్ మై షోలో 6 రోజుల్లో 10 లక్షల టికెట్లు అమ్ముడుపోయిన వైనం
  • ఇది ఒక రికార్డ్ అని తెలిపిన బుక్ మై షో
దసరాకి విడుదలైన బాలయ్య చిత్రం 'భగవంత్ కేసరి' భారీ విజయాన్ని నమోదు చేసింది. బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్న ఈ చిత్రం ఇప్పటికే రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించింది. తండ్రీ, కూతురు సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియెన్స్ కు దగ్గరయింది. మరోవైపు ఈ చిత్రం మరో రికార్డును అందుకుంది. ఆన్ లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్ ఫామ్ బుక్ మై షోలో కేవలం 6 రోజుల్లో 10 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి. ఇది ఒక రికార్డ్ అని బుక్ మై షో సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. ఈ విషయం తెలిసిన బాలయ్య అభిమానులు ఆనందంలో మునిగిపోతున్నారు.
Advertisement
Balakrishna
Bhagawanth Kesari
Book My Show
Record

More Telugu News