మంత్రి రోజా తీరు వెకిలిగా ఉంది: వర్ల రామయ్య
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మంత్రి రోజా తీరు వెకిలిగా ఉంది: వర్ల రామయ్య

Varla Ramaiah counters minister Roja comments
  • తిరుమల వెంకన్నను దర్శించుకున్న నారా భువనేశ్వరి
  • చంద్రబాబు ఎప్పటికీ జైల్లోనే ఉండాలని ఆమె ప్రార్థించి ఉంటారన్న మంత్రి రోజా
  • నిజం గెలిస్తే జగనే శాశ్వతంగా జైల్లో ఉంటారన్న వర్ల రామయ్య
చంద్రబాబు ఎప్పటికీ జైల్లోనే ఉండాలని నారా భువనేశ్వరి తిరుమల వెంకటేశ్వరస్వామిని కోరుకుని ఉంటారని మంత్రి రోజా వ్యాఖ్యానించడం తెలిసిందే. నారా భువనేశ్వరి నిజం గెలవాలి అని ప్రార్థించి ఉంటే తప్పకుండా అదే జరుగుతుందని, నిజం గెలిస్తే చంద్రబాబు శాశ్వతంగా జైల్లో ఉంటారని రోజా వ్యంగ్యం ప్రదర్శించారు. 

మంత్రి రోజా వ్యాఖ్యలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి రోజా తీరు వెకిలిగా ఉందని విమర్శించారు. నిజం గెలిస్తే జగన్ ఎప్పటికీ జైల్లోనే ఉంటారన్న సంగతి రోజా గుర్తుంచుకోవాలని చురక అంటించారు. 

ఇక, రాష్ట్ర డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిపైనా వర్ల రామయ్య ధ్వజమెత్తారు. డీజీపీ చెప్పేవన్నీ అబద్ధాలేనని అన్నారు. నారా భువనేశ్వరి ఈ నెల 25 నుంచి నిజం గెలవాలి పేరిట యాత్ర చేపడుతున్నారని, ఈ యాత్రకు రక్షణ కల్పించాలని డీజీపీకి లేఖ రాశామని, కానీ నారా భువనేశ్వరి యాత్ర గురించి తమకు తెలియదని డీజీపీ చెప్పడం సిగ్గుపడాల్సిన విషయం అని విమర్శించారు. డీజీపీకి వచ్చే లేఖలను ప్రభుత్వ సలహాదారు సజ్జల పరిశీలిస్తుంటారని వర్ల రామయ్య ఆరోపించారు.
Advertisement
Varla Ramaiah
Roja
Nara Bhuvaneswari
DGP
TDP
YSRCP

More Telugu News