చాలా రోజుల తర్వాత క్లీన్‌షేవ్‌తో కనిపించిన బాలయ్య.. కారణం అదేనట!

Nandamuri Balakrishna Reveals About His Next Movie
  • ‘భగంత్ కేసరి’ విజయోత్సవ సభ
  • దర్శకుడు బాబీతో సినిమా చేయబోతున్న బాలయ్య
  • అందుకోసమే క్లీన్‌షేవ్ అని వివరించిన నటుడు
  • వచ్చే నెలలోనే సెట్స్‌పైకి వెళ్తున్నట్టు చెప్పిన బాలకృష్ణ
  • కాజల్ తర్వాతి సినిమా పేరు వెల్లడించిన బాలయ్య
బాలయ్య-అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ‘భగవంత్ కేసరి’ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన వేడుకలో బాలకృష్ణ నయా లుక్‌లో దర్శనమిచ్చారు. చాలా నెలలుగా గడ్డంతో కనిపించిన ఆయన ఈ వేడుకలో క్లీన్‌షేవ్‌తో కనిపించడాన్ని చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. 

తాను క్లీన్‌షేవ్‌లో కనిపించడంపై బాలయ్య మాట్లాడుతూ.. చాలా రోజుల తర్వాత గడ్డం తీయడంతో తనను తానే గుర్తుపట్టలేకపోయానని నవ్వుతూ చెప్పారు. గడ్డం తీయడం వెనకున్న కారణాన్ని చెబుతూ.. బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నానని, అందుకోసమే ఈ గడ్డం తీసినట్టు చెప్పారు.  

వచ్చే నెలలోనే ఇది సెట్స్‌పైకి వెళ్తున్నట్టు వివరించారు. గడ్డం తీసిన తర్వాత అద్దంలో చూసుకుని చాలాసేపటి వరకు తనను తానే గుర్తుపట్టలేకపోయానని చమత్కరించారు. కాగా, భగవంత్ కేసరి సినిమాలో తనతో కలిసి నటించిన నటి కాజల్ కూడా మరో సినిమా చేస్తున్నారని, దానిపేరు ‘సత్యభామ’ అని బాలకృష్ణ రివీల్ చేశారు.
Advertisement
Balakrishna
Bhagavanth Kesari
Director Bobby
Kajal Agarwal

More Telugu News