Priyanka Gandhi: రాజకీయంగా నష్టపోతామని తెలిసినా మీ ఆకాంక్ష నెరవేర్చాం: ములుగు కాంగ్రెస్ విజయభేరీ సభలో ప్రియాంకగాంధీ

Priyanka Gandhi participated in ts public meeting
షార్ట్స్‌లో చూడండి
రాజకీయ మూల్యం చెల్లించి మరీ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని, తాము నష్టపోతామని తెలిసినప్పటికీ తెలంగాణ ఆకాంక్ష మేరకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చామని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ అన్నారు. ములుగులో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరీ సభలో ఆమె మాట్లాడుతూ... కాంగ్రెస్ ఎప్పుడూ ప్రజల ఆకాంక్షలకే విలువ ఇచ్చిందన్నారు. ప్రత్యేక తెలంగాణ కావాలనుకున్న మీ కల నెరవేరిందని, కానీ ప్రత్యేక రాష్ట్రం వచ్చాక సామాజిక న్యాయం కొరవడిందన్నారు.

తెలంగాణ వస్తే యువత ఆత్మహత్యలు ఆగుతాయని, రైతుల జీవితాలు బాగుపడతాయని భావించారని, కానీ బీఆర్ఎస్ పాలనలో అవేమీ జరగలేదన్నారు. మీ ఆశలను అడియాసలు చేసిందన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఆలోచించకుండా తాము తెలంగాణను ఇచ్చామన్నారు. నెహ్రూ నుంచి సోనియా వరకు అందరూ దీర్ఘకాలిక ప్రయోజనాల గురించే ఆలోచించినట్లు చెప్పారు. ఇప్పటికైనా మీ ఆశలు, ఆశయాలు నెరవేరాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు.

తెలంగాణలో నలభై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారన్నారు. రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే వరికి రూ.2500, మొక్కజొన్నకు రూ.2200 మద్దతు ధర ఇస్తామన్నారు. రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు. ఇందిరమ్మ భరోసా కింద రూ.15వేలు ఇస్తామన్నారు.
Go Back to Shorts
Priyanka Gandhi
Congress
mulug
Rahul Gandhi

More Telugu News