నెక్ట్స్ ఏంటి... మంగళగిరిలో పవన్ కల్యాణ్, నాదెండ్ల కీలక చర్చ
- మంగళగిరి వచ్చిన పవన్ కల్యాణ్
- జనసేన భవిష్యత్ కార్యాచరణపై నాదెండ్లతో సమావేశం
- ఏపీ రాజకీయ పరిస్థితులు, వారాహి తదుపరి దశ యాత్రపై చర్చ
రాష్ట్రంలో రైతుల పరిస్థితులు, కృష్ణా పశ్చిమ డెల్టాలో పంటల పరిస్థితి కూడా చర్చకు వచ్చింది. రైతుల పక్షాన నిలవాలని, అందుకోసం చేపట్టే పోరాటంపై ప్రణాళిక సిద్ధం చేయాలని పవన్ కల్యాణ్ నిర్దేశించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, జనసైనికులపైనా, వీరమహిళలపైనా నమోదవుతున్న కేసుల అంశాలు కూడా పవన్, నాదెండ్ల మధ్య చర్చలో ప్రస్తావనకు వచ్చాయి.
ఏపీలోనూ ఎన్నికలు సమీపిస్తుండడం, టీడీపీతో పొత్తు, బీజేపీతో భాగస్వామ్యం విషయం కూడా వీరి మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.