కాంగ్రెస్ నేతలు కష్టపడితే... ఆ నీళ్లను జగన్ రెడ్డి తీసుకుపోయారు: రేవంత్ రెడ్డి
- పాలమూరు-రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టును కేసీఆర్ ఎందుకు పూర్తి చేయలేదు? అని ప్రశ్న
- ఎంఎంటీఎస్ రైలు తీసుకు వచ్చేందుకు జైపాల్ రెడ్డి ఎంతో కృషి చేశారన్న రేవంత్ రెడ్డి
- కృష్ణా జలాలు, ఎంఎంటీఎస్ రాకపోవడానికి కేసీఆర్ కారణమని ఆరోపణ
అయినప్పటికి ఇప్పటికీ వికారాబాద్‌కు కృష్ణా జలాలు, ఎంఎంటీఎస్ రైలు రాకపోవడానికి కారణం కేసీఆర్ అని ఆరోపించారు. ఈ ప్రాంత ప్రజలకు రాజకీయాల్లో తెలియని రౌడీయిజాన్ని కేసీఆర్ తీసుకువచ్చారన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కాంగ్రెస్ నేతలు మంజూరు చేయిస్తే నీళ్లను జగన్ రెడ్డి తీసుకు పోయారన్నారు. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేయకుండా నిరుద్యోగుల ప్రాణాలు హరిస్తోందన్నారు. ఉద్యోగ పరీక్ష జరగలేదనే బెంగతో ఇటీవలే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందన్నారు. తెలంగాణ దశ, దిశ మారాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలన్నారు.