పాదయాత్ర చేస్తున్న టీడీపీ అభిమానిపై దాడి.. ఆగ్రహం వ్యక్తం చేసిన లోకేశ్
- నంద్యాల నుంచి రాజమండ్రికి పాదయాత్ర చేస్తున్న చింతల నారాయణ
- వినుకొండ దాటిన తర్వాత దాడి చేసిన నలుగురు వ్యక్తులు
- జగన్ సైకోయిజం వైసీపీ కార్యకర్తలకు కూడా అంటుకుందన్న లోకేశ్
మరోవైపు ఈ ఘటనను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఖండించారు. ఇది అమానవీయ ఘటన అని అన్నారు. సీఎం జగన్ సైకోయిజం వైసీపీ కార్యకర్తలకు కూడా అంటుకుందని విమర్శించారు. జగన్ తన శాడిజంను చూపిస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగ వ్యవస్థల విధ్వంసానికి పాల్పడుతున్న జగన్... ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలనే కాకుండా ప్రజలను కూడా హింసిస్తున్నారని దుయ్యబట్టారు. వృద్ధుడు అని కూడా చూడకుండా దాడి చేశారంటే... దాడికి పాల్పడింది ముమ్మాటికీ వైసీపీ సైకోలే అని అన్నారు. జగన్ చూసిన ఫ్యాక్షన్ బాటలో వైసీపీ కేడర్ పయనిస్తూ సామాన్యులను సైతం భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు.