చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ర్యాలీ.. కోటంరెడ్డి సహా 16 మంది నేతలపై కేసులు
- ర్యాలీకి అనుమతినివ్వని పోలీసులు
- వ్యూహాత్మకంగా అడుగులు వేసిన నేతలు
- సినిమా హాళ్లు, లాడ్జీలను కార్యకర్తలతో నింపేసిన కోటంరెడ్డి
- పనబాక లక్ష్మి, సోమిరెడ్డి, ఆనం, పాశం సునీల్‌కుమార్ తదితరులపై కేసులు
అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించడం వల్లే కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. నిజానికి ఈ ర్యాలీకి టీడీపీ నేతలు ముందస్తు అనుమతి కోరినప్పటికీ, శాంతిభద్రతల నేపథ్యంలో పోలీసులు అనుమతి నిరాకరించారు. దీనిని ముందే ఊహించిన నేతలు మంగళవారం రాత్రి నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి ఫోన్‌ను దూరంగా పెట్టేశారు. పార్టీ కార్యకర్తలు, అనుచరులను ముందుగానే సినిమా హాళ్లు, లాడ్జీల్లో నింపేశారు. సరిగ్గా ర్యాలీ ప్రారంభమైన తర్వాత వీరంతా ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి ర్యాలీలో పాల్గొని విజయవంతం చేశారు.