మరోసారి పవన్ కల్యాణ్ కు తీవ్ర అస్వస్థత.. జనవాణి కార్యక్రమం నుంచి వెళ్లిపోయిన వైనం!
- మచిలీపట్నంలో వారాహి యాత్రను కొనసాగిస్తున్న పవన్
- జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా తీవ్ర వెన్ను నొప్పికి గురైన వైనం
- 'గబ్బర్ సింగ్' షూటింగ్ సమయంలో పవన్ వెన్నుపూసకు గాయం
'గబ్బర్ సింగ్' సినిమా షూటింగ్ సమయంలో ఆయన వెన్నుపూసకు గాయమయింది. తాను తరచుగా వెన్ను నొప్పికి గురవుతున్నానని 2019లో ఆయన ప్రకటించారు. గత ఎన్నికల సమయంలో అశ్రద్ధ చేయడం వల్ల వెన్ను నొప్పి పెరిగిందని ఆ ప్రకటనలో ఆయన వెల్లడించారు. పవన్ వెన్ను నొప్పికి గురికావడంతో అభిమానులు, జనసైనికులు ఆందోళన చెందుతున్నారు.