హైకోర్టులో మాజీ మంత్రి నారాయణకు ఊరట.. బెయిల్ పొడిగింపు
- అమరావతిలో అసైన్డ్ భూముల కొనుగోలు కేసు
- ఇప్పటికే ముందస్తు బెయిల్ లో ఉన్న నారాయణ
- తమకు కొంత సమయం కావాలని కోరిన ప్రభుత్వం తరపు న్యాయవాదులు
నారాయణతో పాటు రామకృష్ణ హౌసింగ్ యజమాని బాబి, నారాయణ విద్యాసంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులందరికీ రెండు వారాల పాటు ముందస్తు బెయిల్ ను పొడిగించింది. బాబితో పాటు నారాయణ సంస్థల ఉద్యోగులు ఆయనకు బినామీలుగా అసైన్డ్ భూములను రైతులను బెదిరించి, కొనుగోలు చేశారని సీఐడీ కేసు నమోదు చేసింది. ఆ తర్వాత భూముల విలువ పెరగడంతో వీరు అయాచిత లబ్ధి పొందారని ఆరోపించింది.