Advertisement

చంద్రబాబు అరెస్టుకు నిరసన.. ఢిల్లీలో లోకేశ్ సత్యాగ్రహ దీక్ష ప్రారంభం

Nara Lokesh Hunger Strike Starts In Delhi
  • చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతల ఒక రోజు నిరాహార దీక్ష
  • జైలులో చంద్రబాబు.. రాజమహేంద్రవరంలో భువనేశ్వరి దీక్ష
  • ఢిల్లీలో లోకేశ్‌కు మద్దతుగా కనకమేడల, గల్లా, కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు
  • సాయంత్రం ఐదు గంటలకు ముగియనున్న దీక్షలు
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్టును నిరసిస్తూ ఢిల్లీలో నారా లోకేశ్ ఒక రోజు సత్యాగ్రహదీక్ష చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగానూ టీడీపీ నేతలు సత్యాగ్రహ దీక్షల్లో పాల్గొన్నారు. అధినేత అరెస్టును నిరసిస్తూ గాంధీ జయంతి రోజున ఒక రోజు నిరాహార దీక్షలు చేపట్టాలని టీడీపీ నిర్ణయించింది. 

ఇందులో భాగంగా రాజమహేంద్రవరంలో చంద్రబాబు భార్య భువనేశ్వరి, జైలులో చంద్రబాబు దీక్షకు కూర్చున్నారు. వీరికి మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా పలువురు నేతలు దీక్ష చేపట్టారు. లోకేశ్‌ దీక్షలో టీడీపీ నేతలు కనకమేడల రవీంద్రకుమార్, గల్లా జయదేవ్, కేశినేని నాని, రామ్మోహన్‌నాయుడు పాల్గొన్నారు. మంగళగిరిలో ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు దీక్షకు కూర్చున్నారు. 10 గంటలకు ప్రారంభమైన ఈ దీక్ష సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది.
Advertisement
Chandrababu Arrest
Nara Lokesh
Hunger Strike

More Telugu News